ఒంగోలు అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 19, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఆవరణలోని చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేలా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.