నంద్యాల జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరు అయిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సరోజన ఆస్పత్రి ఆవరణంలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి ,నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి ,కలిసి భూమి పూజ నిర్వహించారు.