నంద్యాల అర్బన్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ కేసులలో పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్న ద్వంశము చేసిన ఎక్సైజ్ అధికారులు
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. గడివేముల మండలం బిలకలగూడూరు సమీపంలోని JSW సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్, పొల్యూషన్ బోర్డు, పర్యావరణ శాఖ అధికారలు పాల్గొన్నారు