సూర్యాపేట: పారాక్వాట్ డైక్లోరైడ్ నిషేధం: రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు
మనుషులు, జంతువులకు ప్రమాదకరం కావడంతో పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగంపై కేంద్రం నిషేధం విధించింది. సెప్టెంబర్ 22 నుంచి దీనికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.