అమలాపురం: అమలాపురంలో స్కానింగ్ కేంద్రాలపై నిఘా: జాయింట్ కలెక్టర్ కీలక ఆదేశాలు
అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి కీలక ఆదేశాలు ఇచ్చారు. భ్రూణహత్యల నివారణకు PC-PNDT చట్టం అమలు, స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్లు, MTP కిట్ల విక్రయాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.