శ్రీశైలం: దోర్నాల చెక్పోస్ట్ వద్ద శ్రీశైలం వెళ్లే భక్తులకు రాత్రి వేచి ఉండే సమయంలో వసతులు కల్పించాలని హైకోర్టులో పిల్ దాఖలు
శ్రీశైల దేవస్థానానికి వెళ్లే భక్తులకు దోర్నాల చెక్ పోస్ట్ వద్ద వసతులు కల్పించాలని సున్నిపెంటకు చెందిన హైకోర్టు న్యాయవాది కాశీరావు పిల్ దాఖలు చేశారు. ఈ విషయమై స్పందించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు న్యాయవాది కాశీరావు తెలిపారు. అటవీశాఖ నిబంధనలను ప్రశ్నించడం కాదని, ఆంక్షలు కారణంగా రాత్రి వేళలో చెక్ పోస్ట్ వద్ద వేచి ఉండే భక్తులకు మౌలిక వసతులు కల్పించటమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.