సంబేపల్లి: మోటకట్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) బేస్‌లైన్ టెస్ట్‌ను డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు.ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల తెలుగు–ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, గణిత ప్రాథమిక సామర్థ్యాలను గుర్తిస్తున్నట్టు తెలిపారు. పరీక్ష ఫలితాలు ప్రతి విద్యార్థి స్థాయి, పాఠశాల పనితీరుపై స్పష్టతనిస్తాయని చెప్పారు.మార్చి 2026 నాటికి అందరూ ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలు సాధించేలా రీమిడియల్ బోధన, ప్రత్యేక శిక్షణలు తీసుకువస్తామని నరసింహారెడ్డి పేర్కొన్నారు.