డోన్: ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో సర్దుబాటు జరిగింది మిగిలిన ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తాం : మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Oct 25, 2026 డోన్, బేతంచర్ల మున్సిపల్ ఎన్నికలతోపాటు రానున్న సర్పంచ్ ఎన్నికల్లో సైతం తప్పనిసరిగా పోటీ చేస్తామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సర్దుబాటు జరిగిందన్నారు. కానీ మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో తప్పనిసరిగా బరిలో ఉండి అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎండగడతామన్నారు.