మార్కాపురం: కలెక్టర్ కార్యాలయంలో నివాస స్థలాలు కేటాయించాలని మాజీ సైనికులు నిరసన
నివాస స్థలాలు కేటాయించాలని మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో మాజీ సైనికులు నిరసన తెలియజేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం న్యాయమైన కోరికలు పరిష్కరించాలన్నారు. గత కొన్ని నెలలుగా సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాలేదు అన్నారు. ఇప్పటికైనా మాజీ సైనికుల సేవలను గుర్తించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను కేటాయించి కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.