ఒంగోలు అర్బన్: సముద్ర తీరాన్ని శుభ్రం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన తీరం మన బాధ్యత అంటూ నినాదం
Ongole Urban, Prakasam | Sep 20, 2026
అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా గడిచిన కొద్దిరోజులుగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సముద్ర తీరాలను శుభ్రం చేస్తున్నారు అందులో భాగంగా HCL Foundation మరియు Animal Warriors Conservation Society ఆధ్వర్యంలో HCL కు చెందిన 140 మంది Software ఉద్యోగులు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ నుండి కొత్తపట్నం పల్లెపాలెం సముద్ర తీరంలో, ప్లాస్టిక్ వ్యర్ధాలు, ప్లాస్టిక్ వలలు, ఇతర వ్యర్ధాలను తొలగించి శుభ్రపరిచినారు. GHOST NETS అనగా సముద్రతీరంలో వదిలేయబడిన ప్లాస్టిక్ వలలు పర్యావరణానికి మరియు తాబేళ్ళు ఇతర మత్స్య సంపదలకు ముప్పు అని వారు తెలిపినారు.