ఒంగోలు అర్బన్: చీమకుర్తి మిడివెస్ట్ గ్రైనేట్ క్వారీలో బండ రాళ్లు రాలిపడ్డ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మిస్సింగ్ కూలీలపై ఆరా
Ongole Urban, Prakasam | Oct 1, 2026
ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని మిడ్వెస్ట్ గ్రానైట్‌లో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్రానైట్‌లో ఎంతమంది సిబ్బంది, కార్మికులు ఉన్నారనే అంశంపై ఆరా తీశారు. మైన్స్‌లో ఎవరైనా ఉన్నారా? ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయాలపై మైన్స్ అధికారులను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు.