మార్కాపురం: ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం తెలుసుకోవాలి: కలెక్టర్ విజయ సునీత
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.