బోథ్: బోథ్ మండలంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగయ్య
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నాలుగు పత్తి జిన్నింగ్ మిల్లులలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగయ్య ప్రారంభించారు. సీసీఐ ద్వారా పత్తిని కనీస మద్దతుధర రూ.7,521 రూపాయలతో కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.7,110తో కొనుగోలు చేశారు.రైతులు పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉండేలా ఆరబెట్టి మార్కెట్ కు తీసుకువస్తే మద్దతు ధర లభిస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగయ్య రైతులకు సూచించారు.