రాజోలు: రాజోలు తాటిపాకలో భారీ అగ్నిప్రమాదం: 20 లక్షల ఆస్తి నష్టం
రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బేకరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.