ఒంగోలు అర్బన్: ఒంగోలులో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన కలెక్టర్ రాజాబాబు, మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్
Ongole Urban, Prakasam | Oct 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ రాజాబాబు తో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రి స్వామి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలవేసి ప్రజా ప్రతినిధులు అధికారులు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ అడుగుజాడలు అందరికీ ఆదర్శమని మంత్రి స్వామితో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.