నిర్మల్: బీర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి: బీజేపీ ఎస్టీ మోర్చా పిలుపు
Nirmal, Nirmal | Nov 7, 2026 నిర్మల్‌లో భగవాన్ బీర్సా ముండా జయంతి వేడుకల సన్నాహక సమావేశం జరిగింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బీర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలని బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు పండిట్ జాదవ్ పిలుపునిచ్చారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.