శ్రీకాకుళం: అరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.55.74 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో భక్తులకు మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు మరియు కనెక్టివిటీని మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.