ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం ఆలయ సమీపంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్న తెలుగు గంగ కాలువ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సాగునీరు అందించాల్సిన తెలుగు గంగా కాలువలు నెలాఖరు సమీపిస్తున్న వెలవెలబోతున్నాయి, ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ దిగువ అహోబిలం ఆలయ సమీపంలో కాలువ పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తుంది, వర్షాభావ పరిస్థితులకు తోడు కాలువకు నీటి విడుదల లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరినా పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు