జనగాం: జనగామలో ఉద్రిక్తత: ఇందిరమ్మ ఇండ్ల కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై ఉద్రిక్తత నెలకొంది. పారదర్శకత పాటించాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తనకు ఇల్లు రాలేదని మనస్తాపంతో బిరు రాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు కాపాడారు. అర్హులైన వారికే ఇండ్లు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.