ఉదయగిరి: సీతారామపురం మండలంలోని ఘటిక సిద్దేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఆత్మకూరు ఆర్డీవో పావని
సీతారామపురం మండలం ఘుటిక సిద్ధేశ్వర ఆలయాన్ని ఆత్మకూరు ఆర్డీవో పావని మంగళవారం పరిశీలించారు. కార్తీక పున్నమి సందర్భంగా ఈ ఆలయానికి బుధవారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ, మండల అధికారులకు సూచించారు.