కర్నూలు: ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వంకదారు శ్రీనాథ్ గుప్తా నియామకం
గ్లోబల్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఏపీ ఉపాధ్యక్షుడిగా ఆదోనికి చెందిన వంకదారు శ్రీనాథ్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. ఆయన నియామకంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.