హనుమకొండ: హన్మకొండలో దిశ కమిటీ సమావేశం: అభివృద్ధి పనులపై ఎంపీ కడియం కావ్య సమీక్ష
హన్మకొండ కలెక్టరేట్లో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలు మరియు పెండింగ్ పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.