రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం కార్యక్రమానికి అందులో విధులు నిర్వహించే కొందరు తూట్లు పొడుస్తున్నారు. పౌర సరఫరాల గోడౌన్లలో విధులు నిర్వహించే కొందరి నిర్వాహకం చూస్తుంటే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా 150 టన్నుల బియ్యం షార్ట్ఏజ్ వచ్చిందంటే నమ్ముతారా..? అవును నమ్మాల్సిందే ఇది ఎక్కడ జరిగిందో తెలుసా నెల్లూరు జిల్లా ఉదయగిరి పౌరసరఫరాల గోడౌన్లలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం పేదల కడుపులు కొట్టేంత పని అయింది.ఏకంగా 30 లక్షలకు పైగా సొమ్మును అప్పనంగా మింగేసాడని వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసర