కర్నూలు: కర్నూలులో బీసీల ఆత్మీయ సమావేశం: కూటమి అభ్యర్థుల గెలుపుపై నేతల పిలుపు
కర్నూలు టీడీపీ కార్యాలయంలో జరిగిన బీసీ ఆత్మీయ సమావేశంలో మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష, 68 మంది కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని టీడీపీ నేతలు గుడిసె కృష్ణమ్మ, నాగేశ్వర్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీల సాధికారతకు కూటమి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.