కాకినాడ సిటీ: కాకినాడలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
కాకినాడ నగరంలోని 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు.