తాడూరు: తాడూరులో రూ.19.59 కోట్ల ధాన్యం మాయం: రైస్ మిల్లు నిర్వాహకులపై సిపిఎం ధర్నా
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులోని శ్రీ లక్ష్మీ నారాయణ అగ్రో ఇండస్ట్రీస్‌లో 8,755 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటనపై సిపిఎం నిరసన తెలిపింది. రూ.19.59 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లింపుపై బాధ్యులైన ఐదుగురు భాగస్వాములను వెంటనే అరెస్టు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.