మార్కాపురం: బోడపాడు గ్రామంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీనివాసులు దంపతులను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీనివాస్ దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఊరేగింపు మెట్లుగానే ఎడ్ల బండితో దంపతులను ఊరేగించారు. గ్రామస్తులు పూల వర్షం కురిపించారు. గురువులపై గ్రామస్తుల చూపిన అభిమానం ఆత్మీయతతో నిర్వహించిన ఈ వేడుక ఎంతో ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.