వైరా: వరంగల్:ఖానాపూర్ మండలంలోని అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరిత బ్యాండెడ్ క్రైట్ పాము బుధవారం స్థానికుల కంటపడింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఎస్ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అరుదైన విషపూరిత పాము కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.
Wyra, Khammam | Aug 12, 2026