ఒంగోలు అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిందలు వేస్తే వారే తగిన సమాధానం చెబుతున్నారు : రాష్ట్ర మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Sep 21, 2026
అనేక అక్రమాలు చేసి ప్రజా వ్యతిరేకతకు గురైనటువంటి వైసీపీ నేతలు నేడు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయటం సరికాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు ఎగ్జామ్స్ నిర్వహిస్తే అనేక అవకతవకలకు పాల్పడ్డారని చుట్టూ నివేదికలో అన్ని బయటకు వస్తున్నాయన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా డీఎస్సీ నిర్వహించి నిష్పక్షపాతంగా ఉద్యోగాలను కల్పిస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు ఉపాధ్యాయులే తగిన విధంగా బుద్ధి చెబుతున్నారన్నారు