తిర్యాణి మండలం రాళ్లకన్నేపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఇల్లును గుత్తేదారుడు నాసిరకంగా కట్టి మోసం చేస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం 5గంటలకు ఆరోపించారు. అమృత బాయికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. దీంతో గుత్తేదారుడు ఆమె దగ్గరికి వెళ్లే నేను ఇళ్లు కట్టిస్తా.. ఇల్లుపై వచ్చే 5లక్షల బిల్లుతో సహా లక్ష రూపాలు అదనంగా తీసుకుంటామన్నారు. అయినా కూడా నాసిరకంగా కట్టడం ఏంటని వారు ప్రశ్నించారు.