పూతలపట్టు: బంగారుపాళ్యం మొగిలి ఘాట్లో మూడు కార్లు ఢీ: తప్పిన ప్రమాదం
బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. వేగంగా వెళ్తూ ఆకస్మికంగా బ్రేక్ వేయడం వల్ల ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.