గీసుగొండ: వరంగల్: ఊకల్ హవేలి శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన సెషన్స్ కోర్టు జడ్జి
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ హవేలిలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నిర్మల గీతాంబ దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.