పుట్టపర్తిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. పట్టణంలోని ప్రధానంగా జయంతి ఉత్సవాలకు నిర్ణయించిన పనులన్నీ పూర్తి చేయాలని, జాయ్ అలుక్కాస్ కంపెనీ ఆధ్వర్యంలో చేపడుతున్న చిన్నపిల్లల పార్క్, హారతి ఘాట్లను పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.