తాండూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డుకు పోటీ చేయాలి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎదగాలని ప్రతి వార్డుకు పోటీ చేయాల్సిన అవసరం ఉందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు ఆదివారం రెండు గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ని పల్లిలో వికారాబాద్ జిల్లా భాజపా కార్యాలయం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి రాగలుగుతామని ఆయన పేర్కొన్నారు