సత్య సాయిబాబా చూపిన సేవ, ధర్మ మార్గం ఎల్లవేళలా అనుసరణీయం అని అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ అన్నారు. ఆదివారం కలెక్టర్లో నిర్వహించిన శ్రీ సత్య సాయి బాబా శత జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ డేవిడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సేవే పరమావదిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,భక్తులు పాల్గొన్నారు.