నందికోట్కూరు: ఎండిపోయిన మొక్కజొన్న పంటలనుగొర్రెలకు మేతగా వదిలేస్తున్నరైతులు ప్రభుత్వం స్పందించాలి గౌరీశ్వర నాయుడు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం 10-బొల్లవరం గ్రామంలో ఎల్నినో ప్రభావం,తీవ్ర కరువు పరిస్థితులు, వర్షపాతం లోపం కారణంగా దెబ్బతిన్న మెట్ట భూముల్లోని మొక్కజొన్న పంటలను ఆదివారం సామాజిక సేవకుడు గుజ్జుల గౌరీశ్వర నాయుడుCPIML లిబరేషన్ కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గుజ్జుల గౌరీశ్వర నాయుడు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోయి, రైతుల కళ్ల ముందే పెట్టుబడులు బూడిదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు చివరకు ఎండిపోయిన మొక్కజొన్నను గొర్రెలకు, మేకలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దయనీ