ఆలూరు: బైక్ ఇవ్వలేదని, ఆలూరు పోలీస్ స్టేషన్ నుంచి జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు
Alur, Kurnool | Nov 21, 2025 ఆలూరుకు సమీపంలోని గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుకున్నారు. అతడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వచ్చిన యువరాజు, తన బైక్ను తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరాడు. వారు నిరాకరించడంతో, నా బైక్ ఇవ్వకపోతే మీ జీపు తీసుకెళ్లిపోతా అని హెచ్చరించాడు. అతడు మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని భావించిన పోలీసులు ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నారు.చెప్పినట్టుగానే రాజు అక్కడే ఉన్న సీఐ జీపును తీసుకుని తన ఊరికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన ఉన్నాడు. గమనించిన సోదరుడు పోలీస్ జీపును తిరిగి తీసుకెళ్లాడు