కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలంటూ ఉదయగిరి బస్టాండ్లో సీపీఎం పార్టీ నిరసన నిర్వహించింది. ఈ కోడ్స్ వల్ల కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని నాయకుడు వెంకటయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.