ధర్మపురి: ధర్మపురిలో 27, 28, 29 తేదీల్లో సీపీఎం ప్రజా చైతన్య సభలు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ నెల 27 నుండి 29 వరకు సీపీఎం ప్రజా చైతన్య సభలు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు లెల్లెల బాలకృష్ణ పిలుపునిచ్చారు.