జగిత్యాల: జగిత్యాలలో అందుబాటులోకి వచ్చిన కొత్త వ్యవసాయ డ్రోన్: ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 9 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన డ్రోన్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. పంటలపై పిచికారీకి ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని, దీనివల్ల రైతులకు శ్రమ తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు.