వింజమూరు మండలంలోని కావలి - ఉదయగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సిజేఎస్ఫ్ భూములను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 93 ఎకరాల భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి కేటాయింపుల్లో భాగంగా ఈ భూములను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల పరంగా పరిశీలించి హరీష్ అయిన వారికి న్యాయం చేస్తామన్నారు.