జడ్చర్ల: గొర్ల మందపై కుక్కల దాడి 30 గొర్లు మృత్యువాత మరో 15 తీవ్ర గాయాలు
నాలుగు లక్షలకు పైగా నష్టం కన్నీరు మున్నీరవుతున్న రైతు
గొర్ల మందపై కుక్కలు దాడి చేసి 30 గోర్లు మృత్యువాత పడగా మరో 15 గోర్లకు తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య ఉన్నాయి దీంతో రైతుకు సుమారు నాలుగు లక్షలకు పైగా అపారం నష్టం వాటిలిన ఘటన మంగళవారం జడ్చర్ల మండలం తుప్పడ గడ్డ తండ గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని తుపడ గడ్డ తండా కు చెందిన లష్కర్ నాయక్ కు చెందిన సుమారు 70 గోర్లను సోమవారం రాత్రి ఎప్పటి మాదిరిగానే గ్రామ సమీపంలో ఉన్న తన గొర్ల డోదిలో గొర్లను బంధించి ఇంటికి వెళ్ళాడు మంగళవారం తెల్లవారుజామున రైతు లష్కర్ నాయక్ గొర్లమంద వద్దకు వెళ్లి చూడగా అప్పటికే గొర్ల మందపై కుక్కలు దాడి చేసి 30 గొర్లను చంపగా మరో 15 గోర్లను తీవ్రంగా గాయపరి