చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్యాలెస్ వీధిలో కాపురం ఉంటున్న పురుషోత్తం 70 సంవత్సరాలు ,రాధాకృష్ణ 65 సంవత్సరాలు అన్నదమ్ములు కిరాణా కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాధాకృష్ణ బాత్రూంలో జారిపడి తలకుత్రివంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న అన్న పురుషోత్తం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు . వెంటనే స్థానికులు పురుషోత్తం ను ఆసుపత్రికి తరలించగా పురుషోత్తం అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చావులోనూ విడదీయని అన్నా తమ్ముళ్ల బంధం.