రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండలంలోని యనకండ్లలో సోమవారం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ .2 కోట్ల నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పార్టీ కార్యాలయం నిర్మాణానికి మంత్రి బీసీ. దంపతులు భూమి పూజ చేశారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. తన సొంత గ్రామం యనకండ్లను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయనను అన్నారు.