శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు
ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి కృష్ణమూర్తి ఇంట్లో పోలీసులు మంగళవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు.మున్సిపల్ ఎన్నికలవేళ ఈ సోదాలు పట్టణంలో కలకలం సృష్టించాయి. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు భారీ ఎత్తున కృష్ణమూర్తి ఇంట్లో డబ్బు నిలువ చేశారన్న పక్కా సమాచారంతో ఈ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 40 లక్షల రూపాయలు లభించినట్లు విశ్లేషనియంగా సమాచారం. లభించింది డబ్బులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.