వరంగల్: హెడ్ కానిస్టేబుల్‌పై పెట్రోల్‌తో దాడికి యత్నం.. నలుగురు అరెస్ట్
వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై పెట్రోల్‌తో దాడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రాకేశ్, సువర్ణ, సునీల్, యాకూబ్‌లను అదుపులోకి తీసుకుని, వారి ఆటోను సీజ్ చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు.