మంచిర్యాల: జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: మంచిర్యాలలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నిరసన
జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని కోరుతూ మంచిర్యాలలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నిరసన తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.