బనగానపల్లె: ఏబీవీపీ బనగానపల్లె నూతన కార్యవర్గం ఎన్నిక
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బనగానపల్లె నూతన కార్యవర్గాన్ని కర్నూలు విభాగ్ కన్వీనర్ యుగంధర్ ప్రకటించారు. బనగానపల్లె భాగ్ కన్వీనర్‌గా దివాకర్, నగర కార్యదర్శిగా సుభాను నియమించారు. యుగంధర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం, జాతీయ భావన పెంపొందించడం, సేవా కార్యక్రమాల నిర్వహణే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.