జగ్గంపేట: గోకవరం: ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
గోకవరం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు. అయితే, ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక, అంగబలాలను బేరీజు వేస్తూ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.