నల్గొండ: పోషణ మాసం: గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం - సిపిడిఓ చంద్రకళ
అప్పాజీపేట రైతు వేదికలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐసిడిఎస్ సిపిడిఓ చంద్రకళ అవగాహన కల్పించారు. శ్రీమంతాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాల ద్వారా పోషణ ప్రాముఖ్యతను వివరించారు.